Read News in Telugu Language
adsdaksha

బిఆర్ఎస్ గూటికి జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 20

తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందన్న కేటిఆర్ ..

జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని మంత్రి కేటిఆర్ ( minister ktr ) వ్యాఖ్యానించారు. 2009 లో బీఆర్ఎస్ ( brs ) నుంచి వెళ్లిపోయిన జిట్టా బాలకృష్ణారెడ్డి ( jitta balakrishnareddy ) రాకతో తప్పిపోయిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందన్నారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ( mamilla rajender ), రావుల చంద్ర శేఖర్ రెడ్డి ( raola chandrashekhar reddy ) శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్​ ( telangana bhavan ) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..

read also : తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడండి ..

జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని అన్నారు. యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తోడుగా ఉన్నారని చెప్పారు. ఉద్యమనేతలు అందరూ తిరిగి పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ‘కొందరు నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారు. నోట్లకట్టలతో దొరికిన రేవంత్‌.. డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్‌ విసురుతున్నారు. రేవంత్‌ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది. కాంగ్రెస్‌ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చింది. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది అప్పటి టీఆర్ఎస్ పార్టీనే. సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా?’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Hospital

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉంది.. తెలంగాణ కు ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటుంది ఇప్పటికే 11సార్లు ఛాన్స్ ఇచ్చారు. కేసీఆర్ ను దించేయాలంటున్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చినందుకు దించేయాలా..? దళితులకు దళిత బంధు ఇచ్చినందుకు దించేయాలా..? కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు కేసీఆర్ ని దించేయాలా..? తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు ఏం తక్కువ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు.

read also : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎంతో మాట్లాడుతాం..

తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది కాంగ్రెస్ కాదు.. ఆనాడు బలిదేవత అన్న రేవంత్ కి.. ఇవాళ సోనియా దేవత అయిందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇటు రాహుల్ గాంధీ, అటు నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా కేసీఆర్ ని దించేయాలంటున్నారు. దేశంలో మీ పెత్తనానికి అడ్డు కట్ట వేస్తాడనే దించేయాలంటున్నారా..? ఏది ఏమైనా కేసీఆర్ దేశ రాజకీయాల్లో తన సత్తా చాటుతారని స్పష్టం చేశారు.

వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథంతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

కాగా….అంతకుముందు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ తో రావుల’ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.