Read News in Telugu Language
adsdaksha

రేపే జిల్లాలో కేటిఆర్ పర్యటన..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 29

నాలుగు నియోజకవర్గాలను చుట్టిరానున్న మంత్రి కేటిఆర్ ..

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..

: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ( ktr ), మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి ( vemula prashanth reddy ) తో కలసి శనివారం ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటిఆర్ పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా పువ్వాడ మాట్లాడుతూ హెలికాఫ్టర్ లో మొదట గుబ్బగుర్తి ( gubbagurthi ) కి చేరుకున్న కేటిఆర్ అక్కడ ఆయిల్ ఫాం ప్యాక్టరీని ప్రారంభిచనున్నట్లు తెలిపారు. అనంతరం ఖమ్మం లో 1350కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.

read also : గృహలక్ష్మి సీఎం కేసిఆర్ మానస పుత్రిక : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Hospital

లకారంలో ఎన్ టిఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కి శంకుస్థాపన, త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లు కేటిఆర్ ప్రారంభిస్తారని మంత్రి పువ్వాడ తెలిపారు. అనంతరం మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, తీగల బ్రిడ్జికి శంకుస్థాపన, విడిఓస్ కాలనీ లో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవంచేసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఖమ్మం ప్రగతి నివేదిన సభ
నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో చేసిన పట్టణ ప్రగతి డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. వేలాది మంది ప్రజలు పాల్గొనే ప్రగతి నివేదన సభలో మంత్రి కేటిఆర్ ప్రసంగించనున్నట్లు తెలిపారు.

ఖమ్మంలో సభ అనంతరం మంత్రి కేటిఆర్ వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భద్రాచలంలో గోదావరి కరకట్టకు 38కోట్లతో నిధులు మంజూరైన నేపధ్యంలో కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన, అంబేద్కర్ సెంటర్ నుండి కూనవరం రోడ్డు లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు అనంతరం సత్తుపల్లిలో జరిగే అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభిస్తారని అనంతరం జరిగే సభలో మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు.

read also : puvvada : ఖమ్మం నా ఇల్లు .. ఇక్కడి ప్రజలంతా నాకుటుంబ సభ్యులే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతి సంవత్సరం కేటిఆర్ వందల కోట్ల నిధులు తీసుకుని వస్తున్నారని, గత ఆరేళ్ళుగా ఇదీ ప్రతీ సంవత్సరం ఆనవాయితీగా వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటిఆర్ అండదండలతో జిల్లాలో అద్భుతమైన అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అన్నారు.

అసెంబ్లీ వేదికగా ఖమ్మం అభివృద్ధి ని సీఎం కేసిఆర్ అభినందించారని, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చి ఖమ్మం అభివృద్ధి ని చూసి వెళ్లారని మంత్రి గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.