Read News in Telugu Language
adsdaksha

ఆరేళ్ల కల సాకారమైన వేళ… పొంగులేటి చొరవతో అప్పలనర్సింహాపురానికి బస్సు సర్వీస్..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 29

– గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన దయాకర్ రెడ్డి..

– హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు..

Hospital

నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం గ్రామస్తుల ఆరేళ్ల కల సాకారమైంది. మంత్రి పొంగులేటి ( minister ponguleti ) చొరవతో గ్రామస్తుల మోములో సంతోషం వెల్లివిరిసింది. మండలానికి కూతవేటు దూరంలో ఉన్న అప్పల నరసింహాపురం గ్రామానికి ఆర్టీసీ ( rtc ) బస్ సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు ఎన్నో సార్లు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. తమ గ్రామానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించాలని వారు చేసిన విజ్ఞప్తులు పట్టించుకోక పోవడంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి దృష్టికి ఆదివారం తీసుకువెళ్ళారు.

Read also: వచ్చే నెలలోనే మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం..

అందుకు స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. గ్రామస్తుల కోరిక మేరకు బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో అధికారులు బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయాన్నే ఆ గ్రామానికి బస్సు రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో ఎనికె జానకి రామయ్య, మన్నే నగేష్, శీలం పెద్ద వెంకటేశ్వర్లు, పుసులూరి విశ్వనాథం, పెంటమాల అశోక్, వెంపటి స్వామి, అయినాల భాస్కరరావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.