Read News in Telugu Language
adsdaksha

కేటీఆర్ కి మైండ్ పనిచేయడం లేదు.. మంత్రి సీతక్క మండిపాటు..

దక్ష న్యూస్, వేములవాడ : జనవరి 25

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మైండ్ పని చేయడం లేదని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వింధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ( minister seethakka ) మండిపడ్డారు. గురువారం మంత్రి సీతక్క వేములవాడ రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క .. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఆగమాగం అవుతున్నారని అన్నారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు పథకాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కి ఇంకా దొర అహంకారం పోలేదన్నారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేస్తే ప్రజలు గుర్తిస్తారని హితవు పలికారు. లేదంటే ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని హెచ్చరించారు.

Read also: ఓటు హక్కు ప్రజల చేతిలో ఆయుధం లాంటిది : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..

Hospital

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు.. ఇతర హామీలపై నిలదీస్తున్నారు. ఆర్నెళ్లలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడతారని పగటి కలలు కంటున్నారు. అంతేకాదు.. ఫేక్ వీడియోలతో ప్రజలను, సొంత పార్టీ శ్రేణులను పక్కదారి పట్టిస్తున్నారు.

కెటిఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ప్రతిపక్ష హోదా అయినా సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.