Read News in Telugu Language
adsdaksha

మేడారం జాతరకు రూ.100 కోట్లు.. వన దేవతలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మొక్కులు..

దక్ష న్యూస్, వరంగల్ : ఫిబ్రవరి 5

అడవి బిడ్డలు, గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మంత్రి సీతక్క  ( minister seethakka ) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కోటి మంది భక్తులోచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సోమవారం మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ జాతరకు రవాణా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Read also: 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ .. లఖ్ నవూ జిల్లా కారాగారంలో కలకలం..

Hospital

ఈ సారి 6 వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు సీతక్క తెలిపారు. గతం కంటే ఈ సారి క్యూలైన్లు పెంచినట్లు వివరించారు. జాతరకు దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని సీతక్క అన్నారు. మేడారం జాతరను జాతీయ స్థాయి జాతరగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రతి వారం జాతర పై రివ్యూ చేస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. మేడారంకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

ఆర్టీసీ బస్సుల పార్కింగ్ కు 25 ఎకరాల భూమి కేటాయించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.