Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలబోము : పొంగులేటి

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 21

ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంత్రుల సమీక్ష..

హాజరైన పొంగులేటి, పొన్నం, సురేఖ, సీతక్క..

తెలంగాణ మహా కుంభమేళా, మేడారం జాతరకు మంత్రులు తరలి రావాలని మంత్రి సీతక్క ( minister seethakka ) పిలుపు నిచ్చారు. శనివారం ఉమ్మడి వరంగల్ ( warangal ) జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలపై హన్మకొండ జిల్లా ( hanumakonda district ) కలెక్టరేట్ కార్యాలయంలో అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలో గోదావరి బెల్టుతో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయన్నారు. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువల నిర్మాణం కోసం ల్యాండ్ అక్యువేషన్ జరిగిందని తెలిపారు. పెండింగులో ఉన్న ల్యాండ్ యాక్టివేషన్‌కు డబ్బులు అందించాలని, జిల్లా అభివ‌ృద్ధికి నిధులు అధికంగా మంజూరు చేయాలని ఆమె కోరారు.

Read also: ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ..

Hospital

మేడారం జాతరకు అన్నిజిల్లాల అధికారులు, మంత్రులు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. అనంతరం రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( ponguleti srinivas reddy ) మాట్లాడుతూ.. 12 నియోజకవర్గాల్లో పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో కేటాయింపుల విషయంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా సమావేశం నిర్వహిస్తామన్నారు. 75 కోట్ల నిధులు మేడారం జాతర కోసం కేటాయించామని
మరో 35 కోట్లు నిధులు విడుదల చేస్తాం అన్నారు.

ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలబోమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎవ్వరు ఆక్రమించిన వెనక్కి తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి పూర్తి చెయ్యలేని కాళోజీ కళా క్షేత్రం వీలయినంత త్వరలో పూర్తి చేస్తాం అన్నారు.

Read also: బాలల సర్వతోముఖాభివృద్ధికి చొరవ చూపండి : అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు..

మంత్రి కొండా సురేఖ ( konda surekha ) మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపునకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. నియోజకవర్గాల్లో ఏలాంటి సమస్యలు ఉన్నా జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటికి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్దే ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటగా ములుగు నియోజకవర్గం నుంచి ఇరిగేషన్ శాఖపై సమావేశం ప్రారంభమయ్యిందని చెప్పారు.
సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.