Read News in Telugu Language
adsdaksha

15వ గ్రాండ్ నర్సరీ మేళ .. ప్రారంభమైన హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : పిబ్రవరి 1

మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార , చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( minister tummala nageswararao ) అన్నారు. గురువారం తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ను మంత్రి నెక్లెస్ రోడ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ 15వ గ్రాండ్ నర్సరీ మేళా ఐదు రోజుల పాటూ కొనసాగనున్నట్లు తెలిపారు.

read also : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి..

Hospital

ఈ నర్సరీ మేళాలో మంత్రి తుమ్మల రంగు రంగుల పూలమొక్కలు, మెడిసినల్‌ ప్లాంట్స్‌, దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుంచి వచ్చిన్న ఇంపోర్టెడ్ ప్లాంట్స్, టిష్యూ కల్చర్ మొక్కలు, హార్చీకల్చర్‌ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు లను సందర్శించారు.

read also : మేడారం వెళ్లే భక్తులకు శుభవార్త.. ఏటూరు నాగారం అభయారణ్యం అటవీశాఖ రుసుము మినహాయింపు ..

హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టీకల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ , ప్రధానంగా వెస్ట్‌ బెంగాల్‌లోని డార్జిలింగ్, కోల్ కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన 160కు పైగా నర్సరీ స్టాల్స్ ద్వారా ఈ షోలో ప్రదర్శిస్తున్న, పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, హార్టికల్చర్, ఉత్పత్తులు ఆర్గానిక్ ఎరువులు పరిశీలించి మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. రైతులకు నగరవాసులకు ఉపయోగపదడే విధంగా ఉన్నాయని, ఈ నర్సరీ మేళాను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు మేళ నిర్వహకులను మంత్రి అభినందించారు.

 

Leave A Reply

Your email address will not be published.