Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ కె.వి. కృష్ణారావు నివాసంలో మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 4

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ( tummala nageswararao ) గురువారం  ఖమ్మం ( khammam ) రాపర్తి నగర్ 58వ డివిజన్ వివేకానంద కాలనీలో ఉన్న తెలంగాణ ( telangana ) స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు ( ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ) స్వగృహానికి విచ్చేసి తేనేటి విందును ఆస్వాదించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా వెన్నంటి ఉండి కాపాడుకుంటూ వస్తానన్నారు.

read also : అలర్ట్.. ఈ నెల 15 నుంచి విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు ..

Hospital

స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను నగరానికి దూరంగా తరలిస్తానని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. వారి స్వగృహానికి వచ్చిన సందర్భంగా డాక్టర్ కే. వి కృష్ణారావు ( dr. k.v. krishnarao ) తుమ్మల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన తర్వాత మమ్మల్ని గుర్తుంచుకుని ప్రత్యేకంగా మా స్వగృహానికి రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ వైద్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, మెడికల్ రిప్రజెంట్లు, స్థానిక డివిజన్ వాసులు పాల్గొన్నారు.

read also : అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల షెడ్యూల్ వచ్చేసింది..

Leave A Reply

Your email address will not be published.