Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో తొలి రోప్ వే… పనులకు మంత్రి శంకుస్థాపన..

దక్ష న్యూస్, మహబూబ్ నగర్: అక్టోబర్ 5

రాష్ట్రంలో మెడికల్ టూరిజం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం..

దేశంలో ఎక్కడా లేనివిధంగా 18,000 గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు..

కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ ద్వారా క్రీడాభివృద్ధికి తోడ్పాటు..

గత రెండేళ్లలో రూ.2500 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు..

– వర్చువల్ విధానంలో ఒకేరోజు రూ. 123.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ( telangana ) రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊహించని విధంగా విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud ) తెలిపారు. రాష్ట్ర పర్యాటక, క్రీడలు, వారసత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో చేపట్టిన రూ. 123.67 కోట్ల విలువైన పనులకు గురువారం మహబూబ్ నగర్ ( mahabub nagar ) నుంచి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్ నగర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

Hospital

read also : పేదల పాలిట వరం గృహలక్ష్మి పథకం..

మన్యంకొండ, ములుగు, నల్గొండ, కొత్తగూడెం, సూర్యాపేట ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, బొగత వాటర్ ఫాల్స్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చరీ, అక్కమహాదేవి గుహలు, ఖిల్లా ఘనపూర్ ఫోర్ట్, తదితర ప్రాంతాలలో పర్యటకశాఖ, క్రీడల శాఖ, వారసత్య శాఖ ద్వారా వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తక్షణమే పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకుగాను ముందుగానే అవసరమైన సామాగ్రిని సైతం తెప్పించామని, ఒకేరోజు రూ. 123.67 కోట్ల పనులు ప్రారంభించిన ఘనత తమదేనని తెలిపారు. గత రెండు సంవత్సరాలలో పర్యటక శాఖ ద్వారా రూ. 2400 కోట్లతో కొత్త కొత్త హంగులతో పనులు చేపట్టి కొత్త పర్యాటకులను ఆకర్షించేలా పర్యటక శాఖ పనిచేసిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రపంచ పర్యాటకుల సందర్శన 1056 శాతం పెరిగిందని అన్నారు. ఇది సీఎం కేసీఆర్ విజన్, పర్యాటకశాఖ అధికారులు, సిబ్బంది పనితీరు వల్లనే సాధ్యమైందని అన్నారు. పర్యాటక, క్రీడలు తదితర రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో తొలి రోప్ వే…

రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్ వే ను మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద రూ.50 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కెసిఆర్ అర్బన్ ఎకో పార్కులో జంగిల్ సఫారీ, బర్డ్ ఎన్ క్లోజర్ ప్రారంభించామని, విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో రాష్ట్రానికి తీసుకురావాలన్నదే తమ ప్రణాళిక అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ క్రీడా కిట్లను పంపిణీ చేశామని, రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకువచ్చామని, పోచంపల్లి గ్రామానికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డును తీసుకు వచ్చామన్నారు. పురావస్తు శాఖ, క్రీడా శాఖ ద్వారా రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎంతో గుర్తింపు తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో కొండపోచమ్మ సాగర్, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన సస్పెన్షన్ బ్రిడ్జిలు ఇప్పుడు తెలంగాణలో 7 నిర్మించామని, ప్రపంచంలోని అతిపెద్ద నగరాలలో నిర్వహించే డ్రోన్ షోలను సైతం మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్ వంటి జిల్లా కేంద్రాలలో నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 20వేలకు పైగా గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వందల ఎకరాల భూములను క్రీడా శాఖకు ఆప్పగించామని, ఒలంపిక్, జాతీయస్థాయి క్రీడలలో పోటీపడాలన్నదే తమ అభిమతమని మంత్రి తెలిపారు.

read also : నవతరానికి వరం కేసీఆర్‌ స్పోర్ట్స్‌ కిట్స్‌.. మోదీది “ఖేలో ఇండియా కాదు.. ఖతం ఇండియా”

టూరిజం శాఖ ద్వారా 2500 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామని, అందులో భాగంగానే ఒకేరోజు రూ. 123.67 కోట్లతో పనులు ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, అడిషనల్ ఎస్పీ రాములు, ఆర్కియాలజీ డైరెక్టర్ నారాయణ, పర్యాటకశాఖ చీఫ్ ఇంజనీర్ వెంకట రమణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు వెంకటేశ్వర్లు, తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.