Read News in Telugu Language
adsdaksha

ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ..

దక్ష న్యూస్, న్యూఢిల్లీ : జనవరి 20

ఫిబ్రవరి 18 నుండి పోటీలు ..

28 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం దక్కిన అవకాశం..

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈఓ జూలియా మోర్లే ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. మిస్ వరల్డ్ ఆతిధ్య దేశంగా భారత్ ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండని పిలుపునిచ్చారు. భారత్ లోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయను ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Hospital

read also : ఒకే దేశం-ఒకే ఎన్నిక అనే ఆలోచనను పక్కనపెట్టండి..

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబయిలో జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. భారత్ లో చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదిక కానున్నది. సంప్రదాయ అందాల పోటీలకు అతీతంగా తొలిసారిగా మిస్ వరల్డ్ ఈవెంట్ ను 1851లో నిర్వహించారు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం.

read also : మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్ ..లండన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి..

1966లో భారత్ కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, 1997లో డయానా హేడెన్, 1980లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ‘మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.