Read News in Telugu Language
adsdaksha

ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్.. కూలీ రూ. 400 అవుతుందని హామీ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 15

సాయి వెంకట్ మొగుదుంపురం, దక్ష న్యూస్ నెట్ వర్క్ ఇంచార్జ్.

కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 400 రూపాయలు అవుతుందని సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ( mla dr. ragamayi dayanand ) అన్నారు. సోమవారం తల్లాడ ( thallada ) మండలం మాల్సూర్ తండా గ్రామంలో ఉపాధి హామీ కూలీలను గ్రామ ప్రజలను కలిసి ఎమ్మెల్యే ఖమ్మం ( khammam ) జిల్లా కాంగ్రెస్ ( congress ) పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించారు.

READ ALSO : రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

Hospital

తెలంగాణ ( telangana ) రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) ప్రజలకు అందిస్తున్న పథకాలను ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రజలకు గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, గ్రామాల్లో పట్టణాల్లో వున్న సమస్యలు తక్షణమే పరిష్కరించే నాయకులను గెలిపించాలని ఆమె కోరారు. మీ ఆశీస్సుల తో మమ్మల్ని గెలిపిస్తే సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం అని పేర్కొన్నారు.

READ ALSO : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం జిల్లా మంత్రివర్యుల సహకారం తో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉంటుందని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. హస్తం గుర్తు పై ఓటు వేసి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో తల్లాడ మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.