Read News in Telugu Language
adsdaksha

జాయ్ స్మైల్స్ ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదగాలి .. ట్రస్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జారె..

దక్ష న్యూస్, అశ్వారావుపేట: జనవరి 5

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన పాస్టర్ కుంజ రామకృష్ణ దంపతులు వారి కుమార్తె జాయ్ జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ప్రారంభోత్సవం చేయాలని పాస్టర్ కుంజ రామకృష్ణ దంపతులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ( mla jare adinarayana ) ను ఆహ్వానించడానికి వెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే జారె వెంటనే పదివేల రూపాయల సాయం అందించారు. శుక్రవారం ట్రస్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే పాస్టర్ కుంజ రామకృష్ణ దంపతులకు అభినందనలు తెలియజేశారు. తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఆ బాధను దిగమింగుకుని సమాజానికి తమ వంతు సేవ చేయడానికి ట్రస్టును ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

read also : ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు…

తాను ఎమ్మెల్యే కాక మునుపే రామకృష్ణ దంపతులను కలిశానని, జాయ్ మరణ వార్త విని వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ట్రస్టు ప్రారంభించాలని వారితో చెప్పానని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పోయిన సంవత్సరం తాను చెప్పిన మాట ఈ సంవత్సరం తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నెరవేరడం మరింత ఆనందంగా ఉందని అన్నారు. జాయ్ స్మైల్స్ ఫౌండేషన్ భవిష్యత్తులో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Hospital

read also : t 20 : టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తొమ్మిది, పదవ తరగతుల పిల్లలకు పెన్నులు పరీక్ష పాడ్లు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్పోకెన్ హిందీ పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పిల్లలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె క్రైస్తవ గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే రాగయుక్తంగా పాడుతుండగా అక్కడున్న పాస్టర్లు అందరూ ఏకీభవించడంతో ప్రారంభోత్సవం కార్యక్రమం కాస్తా భారీ బహిరంగ సభను తలపించింది. ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక సర్పంచ్ ఎంపిటిసి సిడిపిఓ నిర్మల జ్యోతి, పాస్టర్లు పాల్గొన్నారు.

read also : ఖమ్మంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ..

Leave A Reply

Your email address will not be published.