Read News in Telugu Language
adsdaksha

మాదాంట్లోకొస్తే మంత్రి పదవి ఇస్తం : హరీశ్ రావుకు ఎమ్మెల్యే రాజగోపాల్ ఆఫర్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 12

బీఆర్ఎస్ వదిలీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇస్తామని మునుగోడు ( munugodu ) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( mla komatireddy rajagopal reddy ) ఆఫర్ చేశారు. బీఆర్ఎస్ ( brs ) ప్రభుత్వంలో చేసిన పాపాలు కడుక్కోవాలంటే మేం దేవాదాయ శాఖ మంత్రి ఇస్తామని కామెంట్ చేశారు. సోమవారం రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘మాజీ మంత్రి హరీశ్ రావు ( harishrao ).. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నా హరీశ్ కు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్ ( congress ) లోకి వస్తే తీసుకుంటామని చెప్పారు. ఇందుకు 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు. అప్పుడు ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు.

read also : రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెంచిన సర్కార్..

Hospital

“హరీశ్, కడియంలా మేము జీ హుజూర్ బ్యాచ్ కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మేం పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్లం అన్నారు. ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర మాది అని చెప్పారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారు. గతంలో మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాపై పడింది అని తెలిపారు.

read also : సిసోడియాకు బెయిల్ .. ఆప్ సీనియర్ నేతకు స్వల్ప ఊరట..

బీఆర్ఎస్ నల్గొండ సభకు జనం వచ్చే అవకాశం లేదు అట్టర్ ఫ్లాప్ అవుతుందని మంత్రి జోస్యం చెప్పారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్టీని నడపాలని సూచించారు. హరీశ్ ను మా పార్టీలోకి రమ్మంటున్నాం ఆయన కష్టపడతారు కానీ అక్కడ భవిష్యత్ లేదు కాబట్టి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.