Read News in Telugu Language
adsdaksha

జిల్లా కలెక్టరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూనంనేని..

దక్ష న్యూస్, పాల్వంచ : జనవరి 6

పాల్వంచలో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై దృష్టి సారించాలి..

కలెక్టర్, రెవిన్యూ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల జన్మదినం సందర్భంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ( mla kunamneni sambashivarao ) శనివారం కలెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Hospital

అనంతరం అడిషనల్ కలెక్టర్ రాంబాబు, డిఆర్వో రవీంద్రనాధ్ లతో సమావేశమయ్యారు. పాల్వంచ పరిధిలోని 444, 817, 727, 999 తదితర సర్వే నెంబర్ల పరిధిలో స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని, దీంతో స్థల, గృహ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందులను త్వరితగతిన అధిగమించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలన గ్రామసభలు విజయవంతంగా నిర్వహించడంపట్ల అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని పలు సమస్యలు, అంశాలపై చర్చించారు. ఇటీవల పేదలకు పంపిణి చేసిన ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిర్వాసితులకు కేటాయించిన స్థలాల కేటాయింపు ప్రక్రియ త్వరిత గతిన పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని కోరారు, పెండింగులో వున్న ఆర్ఆర్ ప్యాకేజీలు అందించాలని, ప్రైజెక్టులు త్వరితగతిన పూర్తిచేసే విదంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్. కె. సాబీర్ పాషా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.