Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. కారు ఢీకొని హోంగార్డు మృతి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 13

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై తిరిగి వెళ్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ( mla lasyananditha ) కారు, మరో కారును ఢీకొంది. నల్గొండ ( nalgonda ) సమీపంలోని చర్లపల్లి ( charlapalli ) వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతిచెందాడు. కేసీఆర్ ( kcr ) సభ నేపథ్యంలో అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది పైకి లాస్య నందిత కారు దూసుకెళ్లింది.

Hospital

read also : బీజేపీ ఎంపీగా జయప్రద పోటీ.. ఎన్నికల నియమావళి కింద కేసులు ..

ప్రమాదంలో నార్కట్‌పల్లి పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ ప్రాణాలు కోల్పోయారు. మరో హోంగార్డుకు తీవ్ర గాయాలు అయ్యాయి. హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.