Read News in Telugu Language
adsdaksha

అధ్యక్షా.. రెండ్రోజులు సెలవు ఇయ్యుర్రి.. అసెంబ్లీలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 13

పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా… పైకొచ్చినా.. అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడినా ఫేమస్ అవుతారు. అయితే సోమవారం అసెంబ్లీలో మల్లారెడ్డి హాస్యం పండించారు. శాసనసభలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై సీరియస్ చర్చ జరుగుతుండగా అధికార మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( mla mallareddy ) లేచి అధ్యక్షా… తనదేమీ లేదు, ఒక్కటే నిమిషం, ఒక్కటే సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మైక్ ఇవ్వాలని స్పీకర్ ను కోరారు.

Hospital

read also : డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో విషాదం .. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూత..

14, 15 తేదీలలో వసంత పంచమి ఉందని, ఆ రోజున 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి రెండ్రోజులు సెలవు ఇయ్యుర్రి అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మల్లారెడ్డి ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు రోజులు అసెంబ్లీ పెట్టవద్దని సభాపతిని కోరారు. మల్లారెడ్డి విజ్ఞప్తితో అసెంబ్లీలో ఒక్కసారే నవ్వులు పూయించారు. సభాపతితో పాటు మిగతా సభ్యులంతా పగలబడి నవ్వారు. ఇప్పుడూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తంగా పాల మల్లారెడ్డి ఎక్కడైనా జోక్స్ వేయగలరని నిరూపించుకున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.