Read News in Telugu Language
adsdaksha

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : జనవరి 6

దోపిడి పాలన పోయి ప్రజాపాలన కొనసాగుతోంది ..

అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ పథకాలు ..

– ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం ..

తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క సమస్య తీర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీలో ఎంపిడిఓ శంకర్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఊకే రామనాథం అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభను పాయం ప్రారంభించారు.

అనంతరం మండల పరిధిలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపడుచులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ 22 చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యాన్ని భరించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, దోపిడి పాలన పోయి ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు.

Hospital

Read also: పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో పక్షులది కీలక పాత్ర : మంత్రి కొండ సురేఖ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని పాయం స్పష్టం చేశారు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల వారిగా అధికారులతో ప్రజలను మమేకం చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,6 గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాయం కోరారు.

గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు తో పాటు ప్రజలు తమకున్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని అధికారులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరిస్తారని అన్నారు. ప్రజా పాలన గ్రామసభ లో పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అవుతాయని అన్నారు.

Read also: జాయ్ స్మైల్స్ ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదగాలి .. ట్రస్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జారె..

అలాగే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు వంటి హామీలను  ప్రభుత్వం అమలు చేసిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పాయం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.