Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి తీగల క్రిష్ణారెడ్డి..?

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 17

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఆపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి ( mla thegala krishnareddy ) బీఆర్ఎస్ ( brs ) ను వీడి హస్తం గూటికి చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు శనివారం కృష్ణారెడ్డి సచివాలయంలో రేవంత్ రెడ్డి ( revanthreddy ) ని కలవడం తీవ్ర చర్చానీయాంశం అయింది. పైకి మర్యాదపూర్వక భేటీ అని చెపుతున్నప్పటికీ.. పార్టీ మార్పుపై రేవంత్, క్రిష్ణారెడ్డి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

read also : ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి అనుసందానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : తుమ్మల

Hospital

ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారడం లేదని, సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు తెలిపారు. అయినా వారు పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా సీఎంతో క్రిష్ణారెడ్డి రెడ్డి భేటీ కావడంతో ఆయన కూడా పార్టీ మారబోతున్నారని వార్తలొస్తున్నాయి. వీరేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు హస్తం పార్టీకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తున్నది.

read also : నేటి యువతరం మెచ్చే బైక్ జావా 350 : తుమ్మల యుగంధర్

మరో పక్క బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమకు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తాజాగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఏదేమైనా లోక్ సభ ఎన్నికల వేళ గులాబీ గూటిలో ఉండేదెందరు.. హస్తంతో దోస్తీ కట్టేదెందరో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.