Read News in Telugu Language
adsdaksha

నేడే ఆఖరు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు చివరి గడువు..

దక్ష న్యూస్, ఖమ్మం: ఫిబ్రవరి 6

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుకు నేటితో గడువు ముగియనుంది. అయితే పట్టభద్రుల ఓటు నమోదుపై కొంతమేర లేనిపోని ప్రచారం ఉంది. కానీ అలాంటి అపోహాలు అవసరం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం డిగ్రీ పట్టా జిరాక్సుపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంగళవారం సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ పట్టా జిరాక్సుపై గెజిటెడ్ సంతకం చేయించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేయబోరు. గెజిటెడ్ సంతకం లేకుంటే మాత్రం అధికారులే ఇంటి వద్దకు వచ్చి ఒరిజినల్ డిగ్రీ మెమో చూసి వెరిఫికేషన్ చేస్తారు. నవంబరు 1, 2020 నాటికి డిగ్రీ పట్టా ఉన్న వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలి.

Read also: అంగన్ వాడీలో పేలిన కుక్కర్.. ఇద్దరు చిన్నారులకు గాయాలు…

Hospital

ఖచ్చితంగా నియోజవర్గంలో ఓటు హక్కు కలిగిన వారు మాత్రమే అర్హులు. స్థానికంగా నివాసం ఉండాలి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సదరు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోయినా సరే సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులు చూపిస్తే సరిపోతుంది. నేటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓపెన్ డిగ్రీ చేసిన వారికి సైతం ఓటు వేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు పెద్దఎత్తున వస్తున్నాయి. మరోవైపు ఓటు కోసం అప్లై చేసుకున్న పట్టభద్రులను ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురావాలంటూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Read also: నేటి నుండే భారత్ రైస్.. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.29లకే కిలో బియ్యం..

మూడు జిల్లాల పరిధిలో ఉన్న పట్టభద్రులు అందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ ప్రచారం చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.