Read News in Telugu Language
adsdaksha

ఉపవాస దీక్షలో కవిత.. గీతాపఠనం, యోగా చేసిన ఎమ్మెల్సీ..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 21

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( mlc kalvakuntla Kavitha ) గీతా పఠనం, భగవన్నామస్మరణతో దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె ధ్యానం చేసి, ఉపవాసం ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లను అందించారు. అంబేద్కర్ జీవిత కథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రచించిన ‘కరుణా నిధి – ఎ లైఫ్’ మరియు శోభానా కె నాయర్ రచించిన ‘రామ్ విలాస్ పాశ్వాన్ – ది వెదర్‌వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’, ఆమె కోరారు.

Read also: ‘ఇండియా’ కూటమి గెలుస్తే పెట్రోల్ రూ.75 : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హామీ..

Hospital

స్వామి సర్వప్రియానంద రచించిన ‘భగవద్గీత’ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి తన దినచర్యలో భాగంగా కవిత చదువుతున్నారు. పుస్తకాల్లోని అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు. ఇతర కేసులతో బిజీగా ఉండడంతో బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఈడీ అధికారులు కవితను విచారించారు. అనంతరం మధ్యాహ్నం భోజన సమయం అనంతరం కొద్దిసేపు ప్రశ్నించారు.

Read also: జియో ఎయిర్ ఫైబర్ ట్రిపుల్ ఇంటర్నెట్ .. 60 రోజుల పాటు ఉచితం..

ఇదీలా ఉంటే మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె అన్న కల్వకుంట్ల తారక రామారావు బుధవారం మరోసారి ములాఖత్ అయ్యారు. మొదటి రోజు కవిత భర్త అనిల్ తో కలిసి వెళ్లిన కేటీఆర్.. రెండు, మూడో రోజు అడ్వకేట్ తో కలిసి వెళ్లి విచారణలో జరిగే పరిణామాలు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవితకు కేటీఆర్, ఆమె తరపు లాయర్ ధైర్యం చెప్పి వస్తున్నారు. గురువారం కవిత తల్లి కల్వకుంట్ల శోభ వెళ్లి ములాఖత్ కానున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.