Read News in Telugu Language
adsdaksha

కవితకు 7రోజుల కస్టడీ ..ఈడీ కార్యాలయానికి తరలింపు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 16

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ( mlc kavitha ) ను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి రూస్ అవెన్యూ కోర్టు ( rouse avenue court ) అనుమతించింది. దీంతో కవితను ఈడీ ( ed ) కార్యాలయానికి తరలించారు. విచారణలో వాంగ్మూలం నమోదు చేయగా కవిత పొంతన లేని సమాధానాలు చెప్పిందని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అందులో కవిత తన వ్యవహారాలన్నీ రామచంద్రపిళ్లై ద్వారా నడిపించిందని ఈడీ వెల్లడించింది. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ద్వారా కవిత ఢిల్లీకి రూ.30 కోట్లు తరలించినట్లు సమాచారం. రూ.30 కోట్లు అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ కేసులో ఆమె కీలక పాత్ర పోషించారని అందులో పేర్కొన్నారు.

Hospital

read also : ప్ర‌జాభ‌వ‌న్‌లో పాద‌యాత్ర సంబురాలు.. పీపుల్స్ మార్ఛ్ పాద‌యాత్ర‌కు ఏడాది పూర్తి ..

ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి అని ఈడీ పేర్కొంది. కవితకు రామచంద్రపిళ్లై బినామీగా వ్యవహరించారని తెలిపింది. కవిత తన మొబైల్ ఫోన్ ఆధారాలను తొలగించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపునకు చెందిన శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి కవిత కుట్ర పన్నారని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత షేర్లు పొందినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరికొందరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్లు లంచం ఇచ్చినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.