Read News in Telugu Language
adsdaksha

తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ..14రోజుల రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 26

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ( brs )  ఎమ్మెల్సీ కవిత ( mlc kavitha ) ను తీహార్ ( theehar ) జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవితకు ఈడీ ( ed ) కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 9 వరకు కవిత జుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు.

read also : ఎంపీ బరిలో కుమారస్వామి .. మండ్యా లోక్‌సభ నుంచి పోటీ ..

ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కవితను తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. కాగా కవితను తీహార్ జైలు నుంచే విచారణ జరిపే అవకాశాలున్నాయి. స్కామ్‌లో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్రపై ముఖ్యంగా కవితను అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. ఇందులో భాగంగా కవితను విడుదల చేయడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, అందువల్ల కవితను కస్టడీకే పంపాలని ఈడీ కోరింది.

Hospital

read also : తెలంగాణ పరువు తీసినవ్ : ఎమ్మెల్సీ కవితపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు..

మరోవైపు కవిత స్పందిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై మోపిన అభియోగాలు ‘పొలిటికల్ లాండరింగ్’కి సంబంధించినవే తప్ప ‘మనీ లాండరింగ్‌’కి సంబంధించినవి కాదని బీజేపీ టార్గెట్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. కవితను తీహార్ జైలుకు పంపడం ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బేనని చెప్పాలి. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఈడీ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం ఈడీకి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

read also : 14సీట్లు పక్కా రావాలి : కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

కవితకు సంబంధించిన అన్ని హెల్త్ రికార్డ్స్‌ను ఆమె న్యాయవాదులకు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా కవిత బెయిల్ పిటిషన్‌పై తమ సమాధానాన్ని ఏప్రిల్ 1న తెలపాలని తెలిపింది. అంతేకాకుండా ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని, నిద్రించడానికి కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని, బంగారు ఆభరణాలను కూడా అనుమతించాలని, ఔషధాలనూ అనుమతించాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.