Read News in Telugu Language
adsdaksha

కవిత ఇంట్లో ఈడీ సోదాలు ..10మంది ఈడీ అధికారులు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 15

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ( mlc kavitha ) ఇంట్లో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ ( hyderabad ) సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ( delhe) మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈడీ ( ed ) జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు, సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కవిత సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Hospital

read also : రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ఇప్పటికే రెండుసార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ గతంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను వారి ఇళ్లలోనే విచారించేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరు కాలేదు.

 

Leave A Reply

Your email address will not be published.