Read News in Telugu Language
adsdaksha

23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 4

ఫేజ్-2 మరమ్మతుల కారణంగా క్యాన్సిల్ అయిన ఎంఎంటీఎస్, రైళ్లు..

హైదరాబాద్ లో 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి- సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్- ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా జంటనగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.

Read also: బీజేపీలో చేరమన్నారు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్-2 మరమ్మతుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తాజాగా మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Hospital

Read also : కాళేశ్వరం తో లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

టైమ్ టేబుల్ చార్ట్ మేరకు ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మౌలాలి-అమ్ముగూడ-సనత్నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్ -సిర్పూర్-కాగజ్ నగర్, వికారాబాద్-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లను షెడ్యూల్ ప్రకారం నిలిపివేయనున్నారు.

Read also: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

హైదరాబాద్ లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.