Read News in Telugu Language
adsdaksha

ప్రధాని మోదీ భూటాన్‌ టూర్.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘డ్రుక్ గ్యాల్పో’ ప్రధానం ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : మార్చి 23

ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. నిజానికి ఆయన పర్యటన గురువారమే ప్రారంభం కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఒక్కరోజు ఆలస్యం అయింది. తాజా పర్యటనలో భాగంగా ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘డ్రుక్ గ్యాల్పో’ను అందజేయనున్నారు. 2021లో మోదీకి ఈ అవార్డు ప్రకటించగా.. ఆ తర్వాత ప్రధానికి అక్కడికి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు దీనిని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చక్ చేతుల మీదుగా స్వయంగా స్వీకరించనున్నారు.

Read also: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ .. ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలిపొద్ది : ఎంపీ లక్ష్మణ్..

Hospital

రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు, కోవిడ్ సమయంలో మొదటి దశలో 5,00,000 వ్యాక్సిన్‌లను అందించడం వంటి చర్యలు తీసుకున్నందుకు ఈ అవార్డు ఇవ్వబడింది.
భూటాన్ చేరుకున్న అనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంధన వినియోగం, ఆహార భద్రత ప్రమాణాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. థింపూలో భారత నిధులతో నిర్మించిన ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు.

Read also: సూర్యాపేట ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ నోటీసులు.. సిజేరియన్లు, అబార్షన్లు చేస్తున్నట్లు నిర్ధారణ…

దేశం యొక్క 13వ పంచవర్ష ప్రణాళిక, వివిధ రంగాల్లో భారత్ అందించాల్సిన సహకారంపై చర్చించనున్నారు. అస్సాం సమీపంలోని భూటాన్‌లో ‘గెల్పూ మైండ్‌ఫుల్‌నెస్ సిటీ’ నిర్మాణం అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ థోల్గే ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.