Read News in Telugu Language
adsdaksha

ఒకేసారి లక్షమందికి అపాయింట్మెంట్స్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 12

కేంద్రంలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ ( pm narendra modi  ) అన్నారు. రోజ్గార్ మేళా చొరవలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ( video conference ) ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన దాదాపు లక్ష మంది అభ్యర్థులకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అలాగే మోడీ న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేశారు.

read alsso : రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెంచిన సర్కార్..

Hospital

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం పారదర్శకంగా మార్చిందని అన్నారు. తమ ప్రభుత్వం నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తోందన్నారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడం, దేశంలోని యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీంతో ప్రతి ఒక్క అభ్యర్థి తన సామర్థ్యం ప్రదర్శించేలా సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అభ్యర్థి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొన్న నాటి నుంచి అపాయింట్మెంట్ లేఖను అందుకొనే వరకూ ఉన్న సమయాన్ని కుదించామన్నారు.

read also : మాదాంట్లోకొస్తే మంత్రి పదవి ఇస్తం : హరీశ్ రావుకు ఎమ్మెల్యే రాజగోపాల్ ఆఫర్..

గత ప్రభుత్వాలు నియామక ప్రక్రియల్లో జాప్యం చేసేవని మోదీ అన్నారు. దీంతో అవి సుదీర్ఘంగా సాగేవని, ఆ సమయంలో లంచాలు, వసూళ్లు వంటివి జోరుగా చోటు చేసుకొనేవన్నారు. కానీ, మా ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేపడుతోందని తెలిపారు. దేశానికి యువత సేవ చేసేలా 2014 నుంచి వారికి సహకరించాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. “మా ‘వికసిత్ భారత్’ ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిదీ కీలక పాత్రే. నేడు కొత్తగా చేరుతున్న లక్షమంది ఉద్యోగులు మాకు నూతన శక్తిని అందిస్తారు. వారు ఏ శాఖలో చేరారన్నది ముఖ్యం కాదు.. దేశానికి అంకిత భావంతో సేవ చేయడం కీలకం. గత ప్రభుత్వంతో పోల్చుకొంటే ఈ పదేళ్లలో మేం 1.5 రెట్లు అదనంగా ఉద్యోగావకాశాలను కల్పించామ ని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.