Read News in Telugu Language
adsdaksha

monkee fever : అమ్మో మరో వైరస్..! కర్ణాటకను భయపెడుతున్న మంకీ ఫీవర్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : పిబ్రవరి 5

గతంలో కోవిడ్ వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికించిన విషయం తెలిసిందే. కొన్ని దేశాలు అయితే ఈ భయంకర వ్యాధితో భారీగా నష్టపోయాయి. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడమే కాక అనేక మంది అయిన వారిని కోల్పోయారు. అయితే తాజాగా మరో సరికొత్త వైరస్ జనాన్ని పరేషాన్ చేస్తోంది. అదే మంకీ ఫీవర్ ( monkee fever ). కర్ణాటక ( karnataka ) లో మంకీ ఫీవర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది మంకీ ఫీవర్ బారిన పడినట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.

Hospital

read also : మరో రెండు గ్యారెంటీలు..? అమలుకు సర్కార్ ప్లాన్..

‘మంకీ ఫీవర్’ కారణంగా ఇప్పటకే ఆ రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు విడచారు. శివమొగ్గ జిల్లాకు చెందిన హోసనగర తాలూకాలో 18ఏళ్ల యువతి, అలాగే ఉడుపి జిల్లా మణిపాల్కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు ‘మంకీ ఫీవర్’తోనే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముందు కోతులను కాటేసి క్రిమి కీటకాలు మనుషులను కరిస్తే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి ప్రారంభ దశలోనే ట్రిట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రాణభయం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు.

read also : పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి – పొదెం వీరయ్య..

Leave A Reply

Your email address will not be published.