Read News in Telugu Language
adsdaksha

టీడీపీకి 17, కాంగ్రెస్ కు 10.. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై ఇండియాటుడే సర్వే..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 8

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ముందే తెలిసిపోయింది. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ప్రజల నాడి ఏంటో తేలిపోయింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’  ( mood of the nation ) పేరిట ఇండియా టుడే సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ (TDP) 17 స్థానాలు కైవసం చేసుకుంటుందని తేల్చింది. అలాగే వైఎస్సార్ సీపీ (YCP) 8 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడైంది.

Read also: మాది ప్రజా ప్రభుత్వం.. త్వరలో రూ.500లకే గ్యాస్, 200యూనిట్ల విద్యుత్ ఫ్రీ : అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళి సై ..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే గురువారం వెల్లడించింది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు సర్వే నిర్వహించినట్లు వెల్లడించింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా 22 లోక్ సభ స్థానాలనూ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తెదేపా మాత్రం 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనాలో వెల్లడైంది. పోలింగ్ లో 45 శాతం ఓటింగ్ తో తెలుగుదేశం పార్టీ 17 లోక్ సభ స్థానాలను గెలుచుకోబోతోందని పేర్కొంది. వైకాపా 41 శాతం ఓటింగ్ తో 8 స్థానాలకు పరిమితం కానుందని పేర్కొంది.

Hospital

Read also: హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు.. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు..

ఇదీలా ఉండగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టనున్నారు. ఈ సారి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తేలింది. 17 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీకి 3, బీఆర్ఎస్ 3, మజ్లిస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3, మజ్లిస్ ఒక సీటు వచ్చింది. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఏడు స్థానాలు పెంచుకోనుందని సర్వేలో తేటతెల్లం అయింది.

Read also: 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాలు .. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది : సీఎం రేవంత్ రెడ్డి ..

బీఆర్ఎస్ కు భారీగా సీట్లు తగ్గనున్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. బీజేపీ ఒక ఎంపీ సీటు కోల్పోనుందని పేర్కొంది. తాజాగా ఇండియా టుడే సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.