Read News in Telugu Language
adsdaksha

భద్రకాళీ సమేత వీరభద్రుడికి వెండి నాగాభరణం సమర్పించిన తాళ్లూరి జయశేఖర్ దంపతులు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : జనవరి 12

బూర్గంపాడు మండలం మోతెగడ్డ వీరభద్రస్వామికి తానా మాజీ అధ్యక్షులు, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు వెండి నాగాభరణం అందజేశారు. శుక్రవారం ఆలయాన్ని కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండి నాగాభరణాన్ని ఆలయ ఈవో సుదర్శన్ కి అందించారు.

Hospital

read also : స్వామి వివేకానంద జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి ..

ఈ సందర్భంగా తాళ్లూరి జయశేఖర్  మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయురాలు డా. గొట్టిపాటి అనితారాణి, ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణ, జయశేఖర్ కుమారుడు శ్రీ సాయి పంచాక్షర్, కుమార్తె శ్రీభావన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.