Read News in Telugu Language
adsdaksha

jayadev galla : రాజకీయాల్లో కొనసాగలేను : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..

దక్ష న్యూస్, గుంటూరు: జనవరి 28

పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని వ్యాఖ్య..

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గుంటూరు ఎంపీ ..

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాజకీయాలకు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇంకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన గుంటూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇకపై నేను రాజకీయాల్లో కొనసాగలేను.. పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కావడం లేదు, రాజకీయాల్లో నా బాద్యత పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నాననే భావన నాలో ఉంది అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ( mp galla jayadev ) వ్యాఖ్యానించారు.

అంతే కాదు 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు. రాజకీయాల్లో నా బాద్యత పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నాననే భావన ఉందని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నానని చెప్పారు. నేను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని, అయితే, రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇబ్బందులని మౌనంగా ఉండలేనన్నారు. పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని గల్లా పేర్కొన్నారు.

Hospital

read also : నేటి యువతరం మెచ్చే బైక్ జావా 350 : తుమ్మల యుగంధర్

రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేకపోతున్నాను గనుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గల్లా తెలిపారు. రెండు పనులు చేయలేకే రాజకీయం వదిలేశానని గల్లా స్పష్టం చేశారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉండనున్నట్లు చెప్పిన ఆయన, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై పార్లమెంట్ లో నేను గళమెత్తానని తెలిపారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండుసార్లు పిలిచి విచారించిందని, నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు.

read also : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి తీగల క్రిష్ణారెడ్డి..?

సీబీఐ, ఈడీ నా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం మా నాన్నకూడా వ్యాపారాల నుంచి రిటైర్డ్ అయ్యారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించనున్నట్లు గల్లా చెప్పారు. గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమని చెప్పిన గల్లా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, ఆ తరువాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని తెలిపారు.

గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి విజయంసాధించారు. అయితే, గతకొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు గల్లా జయదేవ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని , తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ అధిష్టానంకు గతంలోనే జయదేవ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పూర్తిస్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బహిరంగంగా వెల్లడించారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్. తల్లి తరువాత రాజకీయాల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. జయదేవ్ కు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఉంది. ఇతర వ్యాపారాలుకూడా ఉన్నాయి.

 

 

 

Leave A Reply

Your email address will not be published.