Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ .. ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం కూలిపొద్ది : ఎంపీ లక్ష్మణ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 23

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీస్‌లో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని అన్నారు. అయితే ప్రభుత్వం పడిపోతుంటే మాత్రం తాము కాపాడలేమన్నారు.

Hospital

Read also: సూర్యాపేట ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ నోటీసులు.. సిజేరియన్లు, అబార్షన్లు చేస్తున్నట్లు నిర్ధారణ…

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు. పాలన పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై దృష్టి పెట్టారని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను అంధకారంగా మార్చొద్దన్నారు. కాంగ్రెస్ ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.