Read News in Telugu Language
adsdaksha

ఎంపీ నామా నివాసంలో రాఖీ వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 31

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు ( mp nama nageswararao ) నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మహిళా నేతలు, అభిమానులు ఎంపీ నామా కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దిశా కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరావు కి దిశా కమిటీ సభ్యురాలు, అఖిలభారత ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతలచెరువు లక్ష్మి యాదవ్  ( chinthalacheruvu laxmi yadav ) రాఖీ కట్టారు.

read also : voa : వీ వో ఏ లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

అనంతరం మిఠాయిలు తినిపించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ సోదరబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ తరతరాలుగా వస్తున్న మన ఆచారం అన్నారు. ఏడాదికి ఒక్కరోజైనా దూరతీరాల్లో ఉన్న తోబుట్టువులు కలుసుకొని రక్ష ను కట్టుకోవడం కష్టసుఖాలు కలబోసుకోవడం ఎంతో ఓదార్పును, మనో ధైర్యాన్ని ఇచ్చే అంశం అన్నారు.

Hospital

read also : ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు..

మహిళలందరికీ  ఎంపీ నామా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చింతలచెరువు లక్ష్మి తన గృహంలోను రాఖీ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.

read also : గుండెనిండింది.. మనసు పొంగింది..పొంగులేటి నిలయం లో రక్షాబంధన్ వేడుకలు..

 

Leave A Reply

Your email address will not be published.