Read News in Telugu Language
adsdaksha

దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు..

దక్ష న్యూస్, ములుగు: అక్టోబర్ 18

ములుగు బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ..

రాబోయే ఎన్నికలు దొరల తెలంగాణ ( telangana ) కు.. ప్రజల తెలంగాణకు మధ్యే అని కాంగ్రెస్ ( congress ) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ( mp rahul gandhi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని జోస్యం చెప్పారు. ములుగు ( mulugu ) జిల్లాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్‌ ( brs ) కు రోజులు చెల్లాయని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ( kcr ) ఎన్నికలప్పుడు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు.

read also : తుమ్మల పొంగులేటి చెట్టాపట్టాల్.. ఇద్దరం ఒక్కటే.. అంటూ సంకేతం..!

Hospital

దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తామన్న మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఎవరికి అయిన వచ్చాయా అని ప్రశ్నించారు.

read also : మీరే కాదు.. మీ నాయన, తాతా ఉన్నా ఇలాగే చేర్చుకుంటాం..

పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పిస్తాం అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నిలబెట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మెరుగైన పాలన అందిస్తామన్నారు.

read also : డాక్టర్ల మద్దతుకై తుమ్మల వేట..

 

Leave A Reply

Your email address will not be published.