Read News in Telugu Language
adsdaksha

అహాన్ని పక్కనపెట్టి ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తే ప్రధాని : ఎంపీ శశిథరూర్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 3

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ( thiruvananthapuram ) ఎంపీ శశిథరూర్ ( mp shashidarur ) ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఆయనకు విలేకరుల నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (pm narendra modi ) కి ప్రత్యామ్నాయంగా ఎవరిని భావిస్తున్నారో చెప్పాలని జర్నలిస్టులు కోరారు. దీనికి థరూర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

read also : ఆసక్తి కరంగా రాహుల్ గాంధీ ప్రసంగం.. వయనాడ్ లో నామినేషన్ దాఖలు..

పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధం అని శశిథరూర్ అన్నారు. అధ్యక్ష వ్యవస్థలో వలె, మేము ఒక వ్యక్తిని ఎన్నుకోము. మన దేశం యొక్క బహుళత్వం, వైవిధ్యం సమ్మిళిత వృద్ధిని కాపాడేందుకు రూపొందించిన విధానాలకు కట్టుబడి ఉండే పార్టీని లేదా సంకీర్ణాన్ని ఎన్నుకుంటాము. ఎవరు ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం అంటే.. సమర్థుడైన వ్యక్తి, వ్యక్తిగత అహం లేకుండా ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి పీఎంగా అవసరం అన్నారు.

Hospital

read also : కాంగ్రెస్‌, భారాసల వైఖరి టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ..

అంతే కాదు, ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది తర్వాతి విషయం.. మన ప్రజాస్వామ్యాన్ని, భిన్నత్వాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.తమ వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి ప్రజల సమస్యలపై పోరాడే అనుభవజ్ఞులైన, సమర్థులైన నాయకుల బృందం ఇది. అందులోంచి ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలనేది తర్వాతి అంశం. మన ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని పరిరక్షించడమే మొదటి ప్రాధాన్యత’’ అని శశి థరూర్ సోషల్ మీడియాలో కూడా పేర్కొన్నారు.

read also : ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌ ఏప్రిల్ 8కి వాయిదా ..

కేరళలోని తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ తాజా ఎన్నికల్లో అక్కడి నుంచి మరోసారి పోటీ చేశారు. ఆయనపై బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. మరో వైపు నుంచి పన్నియన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. ఈ త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. రెండో విడతలో భాగంగా ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.