Read News in Telugu Language
adsdaksha

ఇల్లందులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టీమ్.. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమావేశం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 13

బీఆర్ఎస్ ( brs ) ఇల్లందు (yellandu ) నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( mp vaddiraju ravichandra ).. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్ సభ సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి శుక్రవారం ఇల్లందులో పర్యటించారు. బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 1న ఇల్లందు రానున్న సందర్భంగా
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

read also : బీజేపీ కి బిగ్ షాక్..

Hospital

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా రంజకంగా నిర్వహించనున్న “ప్రజా ఆశీర్వాద సభ”లో అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం కేసిఆర్ ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మహబూబాబాద్ జిల్లా జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందు తదితరులు పాల్గొన్నారు.

read also : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ..

అనంతరం ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ నివాసంలో జరిగిన సమన్వయ సమాలోచనకు  మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మహబూబ్ ఎంపీ మాలోత్ కవిత, మహబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, వివిధ మండలాల పార్టీ ముఖ్య నేతలు, ఇల్లెందు పట్టణ కౌన్సిలర్లు తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.