Read News in Telugu Language
adsdaksha

బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు:ఎంపీ రవిచంద్ర..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 24

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ( brs ) అభ్యర్థులు దూసుకుపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( mp vaddiraju ravichandra ) అన్నారు. కేసీఆర్ ( kcr ) సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇల్లందు ( yellandu ) లో వచ్చే నెల ఒకటిన జరిగే “ప్రజా ఆశీర్వాద సభ” కు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇల్లందు పర్యటన నేపథ్యంలో ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతితో కలిసి గార్ల మండలం మర్రిగూడెంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరోసారి బిఆర్ఎస్ అధికారంలోకి రావడం, మహానేత చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

read also : ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీ వాకిలి దాటియ్యండి.. పాలేరు ప్రజా ఆశీర్వాద సభ లో కేసిఆర్..

Hospital

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారని, ఇతర పార్టీలు దరిదాపుల్లో కూడా లేవని వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ”లకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎంపీ రవిచంద్ర వివరించారు.

ఇల్లందులో వచ్చే నెల ఒకటవ తేదీన జరిగే బీఆర్ఎస్ సభకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావల్సిందిగా గులాబీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ ప్రముఖులు బానోతు హరిసింగ్ నాయక్, శివాజీ, మూల మధుకర్ రెడ్డి, రంగనాథ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.