Read News in Telugu Language
adsdaksha

మంత్రి మల్లన్న ఎంపీ నామాలే నాకు ఆదర్శం..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ..

దక్ష న్యూస్, ఖమ్మం : ఆగస్ట్ 24

విద్యార్ధులు చదువుతోపాటూ ఏదైనా రంగంలో ప్రావీణ్యం సాధించాలి..

మంత్రి మల్లారెడ్డి ( mallareddy ) ఎంపీ నామా నాగేశ్వరరావు ( mp nama nageswararao ) లు జీవితంలో ఎంతో కష్టపడి ఇప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( mp vaddiraju ravichandra ) అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఒక సదస్సుకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావులను ఆదర్శంగా తీసుకుని వ్యాపారంలో రాణించానన్నారు. ముప్పై ఏండ్ల కిందట చిన్న గ్రానైట్ గనిని లీజుకు తీసుకుని నడిపిన తానిప్పుడు 3వేల మందికి ఉద్యోగాలివ్వడం జరిగిందన్నారు.

read also : Randomisation Software : సాంకేతిక పరి జ్ఞానం తో లబ్దిదారుల ఎంపిక..

Hospital

మన దేశంలో అపారమైన గనులు, ఖనిజ సంపద ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రధాని నరేంద్రమోడీ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. తెలంగాణలోని బయ్యారం సమీపాన ఇనుప ఖనిజం విరివిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చి కూడా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ స్థూపానికి, సెంట్రల్ విష్టాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఉపయోగించిన గ్రానైట్ ను తానే ఇచ్చానని ఎంపీ రవిచంద్ర తెలిపారు. విద్యార్థులు, యువత క్రమశిక్షణ కలిగి కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా జీవితంలో గొప్పగా స్థిరపడొచ్చని రవిచంద్ర ఉద్భోదించారు.

read also : thursday : గురువారం ఎవరిని పూజించాలో తెలుసా..

విద్యార్ధులు చదువుతో పాటు తాము ఎంచుకున్న ఏదేనీ ఒక రంగం, అది వ్యాపారం కావొచ్చు లేదా క్రీడల్లో కూడా ఉన్నతంగా ఎదగొచ్చన్నారు. క్రికెట్ ప్లేయర్ సిరాజుద్దీన్, షూటింగులో వరల్డ్ కప్ సాధించిన నిఖత్ జరీన్, ఖమ్మం ఏసీపీ సారంగపాణి కూతురు మేఘనల నుంచి స్ఫూర్తి పొందాల్సిందిగా ఎంపీ వద్దిరాజు సలహాలిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.