Read News in Telugu Language
adsdaksha

పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావుకు ఘనసన్మానం

దక్ష న్యూస్, పినపాక : జనవరి 29

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ మండలం పినపాక ఎంపీఓగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్తమ ఉద్యోగిగా మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఎంపీఓ వెంకటేశ్వరరావును పినపాక మండల సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. పినపాక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ గుమ్మడి గాంధీ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ పినపాక మండలాన్ని అభివృద్ధి పథంలో ఎనిమిది నెలలలొనే నడిపించిన ఘనత ఎంపీఓ కు దక్కుతుందని అన్నారు. ఇలాంటి మంచి అధికారి పినపాక మండలంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

Read also : ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు.. ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం..

Hospital

అనంతరం ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంపీఓ కు ఉత్తమ ఉద్యోగిగా అవార్డు రావడం అభినందనీయమన్నారు. మండలంలో సమస్యలపై ఆయన స్పందన, పరిష్కరించే తీరును అభినందించారు. అనంతరం సర్పంచుల సంఘం అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో సమస్యలు పరిష్కరించడంలో, సర్పంచులకు మార్గదర్శకంగా పనిచేయడంలో ఎంపీఓ సేవలను కొనియాడారు. ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు చింతపంటి సత్యం మాట్లాడుతూ ఎంపీవో చేస్తున్న శ్రమకు తగిన గుర్తింపు ఉత్తమ ఆఫీసర్ గా గుర్తింపురావడం అన్నారు. ప్రతి సమస్యను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరించే గుణం ఉన్న గొప్ప ఆఫీసర్ పినపాకలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం పొట్లపల్లి సర్పంచ్ కళ్యాణి మాట్లాడుతూ సర్పంచులకు మార్గదర్శకం నిలవడం తో పాటు విధివిధానాలు తెలపడంలో ఎంపీఓ సేవలు మరువలేనివి అన్నారు. ఇలాంటి ఆఫీసర్ ను తన పది సంవత్సరాల సర్పంచ్ గా పనిచేసిన సమయంలో చూడలేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గట్ల శ్రీనివాసరెడ్డి, నిశాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో సైతం ఆయనను సన్మానించారు. అనంతరం పినపాక జర్నలిస్టులు గంగాధర్, భరత్, బృహస్పతి, సారయ్య, పలువురు జర్నలిస్టులు ఎంపీఓను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం ఎంపీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు సహకరించిన సెక్రటరీలకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డ్ అందరి శ్రమకు గుర్తింపు తెచ్చిందన్నారు. మండల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని తెలియజేశారు.

Read also: ఫోటో వీడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా వన్నం కృష్ణమోహన్..

ఏదైనా సమస్య తనవద్దకు వస్తే సమస్య వద్దకు వెళ్లి చూసి, పరిష్కరించే దిశగా పనిచేసే తత్వం తనదని ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ శేఖర్, సర్పంచ్ లు గోగ్గల నాగేశ్వరరావు, కొరస కృష్ణంరాజు, నాగభూషణం, మహేష్, సునీల్, ఈసంభవతి, నాగేశ్వరరావు, తదితరులు, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.