Read News in Telugu Language
adsdaksha

అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 6

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ సర్కారు దసరా కనుకగా నేటి నుండి మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిందని, ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలువనుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar )  అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న “ముఖ్యమంత్రి అల్పాహారం” ( mukyamantri alpahara scheme ) పథకాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖమ్మం ( khammam )  జిల్లా కేంద్రం రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి లతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

read also : సమాచార శాఖ లో 88 పోస్టుల భర్తీకి ఆదేశాలు…

ప్రభుత్వం ఇప్పటికే ఉదయం వేళల్లో రాగిజావను అందిస్తుండగా.. మధ్యాహ్న భోజనాన్ని గుడ్డుతో పాటు అందిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ రెండింటికి మధ్యలో ఇకపై అల్పాహారంగా కిచిడీ, పొంగల్‌, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం మంచి విషయం అన్నారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని అన్ని స్థాయిల విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని ఇక నుండి ప్రతి రోజూ ఇవ్వనున్నామని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను తల్లిదండ్రులు చదివించడానికి వెనుకాడే పరిస్థితుల నుండి నేడు ఎమ్మేల్యే, స్థానిక సర్పంచ్, ఎంపిటిసి లు ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరికి సిఫారసు కోసం వెళ్తున్నారు అంటే ప్రభుత్వ విద్య ఏ స్థాయికి చేరింది అర్దం అవుతుందన్నారు.

Hospital

read also : తెలంగాణలో తొలి రోప్ వే… పనులకు మంత్రి శంకుస్థాపన..

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించిందని అందుకు గాను బడ్జెట్ లో అధిక నిధులు విడుదల చేస్తూ విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిందన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో రేకుల షెడ్ ల కింద వంట, దొడ్డు బియ్యం తో భోజనం, సరైన వ్యవస్థ లేక, అరకొర నిధులు, నిర్వహణ లోపం ఇలా అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు చూశాం.. కానీ నేడు ఆ పరిస్థితులను అధిగమించి ప్రతి పాఠశాలలో ప్రత్యేక కిచెన్ గదులు, నిధులు, బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అందుకే కేసీఆర్ ఉన్నతంగా ఆలోచించి విద్యయొక్క అవశ్యకతను ప్రథమ కర్తవ్యంగా తీసుకుని మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి పథకాన్ని రూపొందించి దశల వారీగా అన్ని ప్రభుత్వం పాఠశాలలో కార్పొరేట్ కు ధీటుగా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీఈఓ సోమ శేఖర్ శర్మ, ఎంఈఓ శ్రీనివాస్, కార్పొరేటర్ జాన్ భీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.