Read News in Telugu Language
adsdaksha

మానవత్వం చాటుకున్న యువ నాయకులు.. ప్రశంసలు కురిపిస్తున్న గ్రామస్థులు..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 17

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇంచార్జ్. దక్ష న్యూస్

ములకలపల్లి మండలంలో ఇటీవల ప్రమదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి చనిపోయిన బొగ్గం వెంకటేష్ కుటుంబానికి స్థానిక యువ నాయకులు ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

Hospital

వివరాల్లో కెళితే ములకలపల్లి ( mulakalapalli ) మండలం సాయిరాంపురం గ్రామానికి చెందిన బొగ్గం వెంకటేశ్ ఇటీవల ప్రమాద వశాత్తు తాటి చెట్టు పై నుండి జారిపడి మృత్యువాత పడ్డారు. దాంతో కుటుంబ పెద్దను కోల్సోయిన నిరుపేద కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజక వర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరాస్వామి, జి.ఎస్.ఎస్ రాష్ట్ర యువజన నాయకులు,సామాజిక కార్యకర్త అరెమ్ ప్రశాంత్ వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

read also : శ్రీరామ నవమి పందిళ్ళను సందర్శించిన సత్తుపల్లి ఎమ్మెల్యే ..

వెంకటేశ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి స్ఫూర్తి నింపిన యువ నాయకుల దాతృత్వానికి గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో సున్నం వీరాస్వామి, మెచ్చు వెంకన్న,
సున్నం నాగమ్మ, సున్నం భద్రమ్మ, సున్నం రాజమ్మ , సవలం పద్మ, వుకే సుజాత, కుంజా మల్లీశ్వరి, సున్నం కాంతమ్మ, కుంజా వీరమ్మ గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.