Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ కు మద్దతుగా ముస్లీం జేఏసి సమావేశం..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 11

ప్రస్తుతం దేశంలో రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలు అత్యంత సంక్లిష్టంగా తయారయ్యాయని , గత పది సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ వల్ల దేశ మనుగడ, దేశ ప్రతిష్ట , దేశ హితం, సమైక్యత సమగ్రత , లౌకికత దెబ్బతింటోందని మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం , మన రిజర్వేషన్ల పరిరక్షణకు …. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని…ఖమ్మం రూరల్ మండల ముస్లిం జే ఏ సీ అభిప్రాయ పడింది. అందుకే ఈ పార్ల మెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించు కున్నట్లు తెలిపింది.

read also : పోరాటాలు ఉద్యమాలతోనే సామాజిక న్యాయం ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్, డాక్టర్ అయేషా సుల్తానా ..

Hospital

శనివారం స్థానిక కోదాడ క్రాస్ రోడ్ లో ఖమ్మం రూరల్ ముస్లిం జే ఏ సి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జే ఏ సి నాయకుడు షేక్. నజిరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మరో జే ఏ సి నాయకుడు రషీద్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ లు సైతం ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కి మద్దతు పలుకాలని పేర్కోన్నారు. జే ఏ సి నాయకుడు జబ్బార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు పలకడం మాత్రమే కాకుండా బహుజనులు అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

read also : జన సంద్రమైన ఖమ్మం.. కదం తొక్కిన కమ్యూనిస్టులు.. భారీ బైక్ ర్యాలీతో విజయ వంతంగా ముగిసిన కాంగ్రెస్ ప్రచార పర్వం..

కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. జే ఏ సి నాయకుడు జావిద్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చందు, యాసిన్, హుస్సెన్, ఎండి. ఫయాజ్ , మౌలాలి, మస్తాన్, నజీర్, పాష, వాజిద్ , ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.