Read News in Telugu Language
adsdaksha

ముత్తిరెడ్డి మమ్ముల్ని ముంచాడు.! మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి..

దక్ష న్యూస్, జనగామ : ఫిబ్రవరి 2

బీఆర్ఎస్ నేత, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తన సొంత కూతురు భూమినే కబ్జా చేశాడనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా దళిత బంధు ఇప్పిస్తానంటూ దళితుల దగ్గర నుంచి లక్ష రూపాయలు చొప్పున 67 మంది దగ్గర వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫాంహౌస్ ను బాధితులు ముట్టడించారు. దళితబంధు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: హైదరాబాద్ కు జార్ఖండ్ పాలిటిక్స్.. నగరానికి చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు..

Hospital

దళితబంధు రానందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని  బాధితులు వాపోయారు. ఈ మేరకు నర్మెట్ట మండలంలోని ముత్తిరెడ్డి ఫాం హౌస్ కు చేరుకుని ఆందోళ చేపట్టారు. ఒకరిద్దరికే దళితబంధు మంజూరైందని, ఆ డబ్బులు రావాలంటే లక్ష రూపాయిలు తమకు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తనకు దళితబంధు ఇప్పిస్తారా అని అడిగితే ప్రభుత్వం మారిందని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే తీసుకోవాలని ముత్తిరెడ్డి బదులిచ్చారని తెలిపారు.

Read also: పూనం ఇక లేరు.. సినీనటి పూనం పాండే కన్నుమూత..

ఇక దళితబంధు రాదని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరామని బాధితులు వెల్లడించారు. బాధితులను అడ్డుకున్న పోలీసులు లిఖిత పూర్వకరంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.