Read News in Telugu Language
adsdaksha

అరెస్ట్ లు అప్రజాస్వామికం…!

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 29

న్యాయమైన డిమాండ్ ను పరిష్కారించాలని ధర్నా చేస్తే నిర్బంధిస్తారా…?

– డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు

రోడ్డు వెడల్పు పెంచాలనే న్యాయమైన డిమాండ్ తో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఇది అప్రజాస్వామికమని డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ( muvva vijay babu ) ఆరోపించారు. ఖమ్మం ( khammam ) లో టీడీపీ ( tdp ) కార్యాలయం సమీపంలో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందని, ఆ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రైతు మార్కెట్, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం వేస్తున్న 3.75 మీటర్ల రోడ్డును సుమారు 5 మీటర్ల వెడల్పు వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ 54వ డివిజన్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సీటీసీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ కనీసం కార్పొరేషన్ కమిషనర్ కి గానీ ఇతర అధికారులకు గానీ వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Hospital

read also : mahesh : మహేష్ బాబు రాజకీయ ఆరంగేట్రం..వైసీపీలోకి ఎంట్రీ..?

బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కారించుకుంటామని తెలిపారు. అరెస్ట్ అయిన నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, సర్పంచ్ గోనె భుజంగ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. కాగా ధర్నా చేసిన వారిలో కార్పొరేటర్ లు మలీదు వెంకటేశ్వర్లు, సైదులు, మిక్కిలినేని నరేందర్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మహ్మద్ జావీద్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కొంగర జ్యోతిర్మయి, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్, ఐ ఎన్ టీ యూ సీ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరాల నరేష్ మోహన్ నాయుడు, విప్లవ్ కుమార్, సంపెట శ్రీను, కె. చంద్రశేఖర్, రవి తదితరులు ఉన్నారు.

read also ; హైదరాబాద్ లో వినాయక చవితి మండపాల కు బంపర్ ఆఫర్..

Leave A Reply

Your email address will not be published.