Read News in Telugu Language
adsdaksha

రాష్ట్రం ఏర్పడ్డాకే అభివృద్ధి సంక్షేమ పధకాలు.. మంత్రి కొప్పుల ఈశ్వర్..

దక్ష న్యూస్, నాగర్ కర్నూల్ : ఆగస్ట్ 26

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల అవసరాలను గుర్తిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( koppula eswar ) అన్నారు. శనివారం ఉదయం ప్రభుత్వ విప్, అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు ( guvvala balaraju ) తో కలిసి నాగర్ కర్నూల్ ( nagarkarnul ) జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చనలో భాగంగా అమ్రాబాద్ ( amrabad ) మండలంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ( collector p. uday kumar ) తో కలిసి మంత్రి మొక్కను నాటారు.

read also : కోటి వృక్షార్చన లో మొక్కలు నాటిన మంత్రులు.. అర్బన్ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభం..

అనంతరం అమ్రాబాద్ మండలంలో రూ. 62 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సి.సి. రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అక్కడే నూర్ బాషా సంఘం మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఖబరస్తాన్, మజీదు మరమ్మతు పనులకు రూ. 30 లక్షల పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు లాంటి కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్షి, ఉచిత విద్యుత్, కోటి యాభై లక్షల ఎకరాలకు సాగు నీరు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా సాగు నీరు కుల మతాల భేదభావం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు.

 

Hospital

9 సంవత్సరాల కాలంలో ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు బంధు కోసం ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలియజేశారు. అచ్చంపేట శాసన సభ్యులు చాలా పట్టుదల గల వారని ఉమామహేశ్వర ప్రాజెక్టును తీసుకువచ్చి అప్పర్ ప్లాట్ ను సస్యశ్యామలం చేస్తారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో చారకొండ మండలం మాదిరి అమ్రాబాద్ లేదా మరో మండలం మొత్తానికి దళితబంధు మంజూరు చేసేవిధంగా ముఖ్యమంత్రికి తనవంతు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుమ్మరోనిపల్లి లో మైనారిటీ కమ్యూనిటీ హాల్, సి.సి. రోడ్డు, రాయలగండి గ్రామంలో దేవాలయం కళ్యాణ మండపం పనులకు శంఖుస్థాపనలు చేశారు.

read also : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ ..

ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ, అమ్రాబాద్ మండలానికి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలో మరో 6 లేదా 7 కోట్లు నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. ఉమామహేశ్వరం ప్రాజెక్టును సాధించడం జరిగిందని త్వరలో టెండరు ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అప్పర్ ప్లాట్ కు సాగు నీరు తేవడమే తన లక్ష్యంగా తెలియజేశారు. చారగొండ మాదిరి అమ్రాబాద్ లేదా మరో మండలానికి దళితబంధు మంజూరు చేసేవిధంగా సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిని కోరారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డి.ఎఫ్. ఒ రోహిత్ గోపిడి, ఆర్డీవో కే. గోపిరాం, డి. ఆర్.డి. ఒ నర్సింగ్ రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రామ్ లాల్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, అమ్రాబాద్ సర్పంచ్ శారద, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.