Read News in Telugu Language
adsdaksha

ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతర.. ప్రత్యేక పూజలు చేసిన మేస్రం వంశీయులు..

దక్ష న్యూస్, ఆదిలాబాద్ : ఫిబ్రవరి 10

గిరిజన జాతరైన నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణలోని రెండవ అతిపెద్ద గిరిజనుల జాతర ఇది. పుష్యమి అమావాస్య రోజున శుక్రవారం అర్ధరాత్రి మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవత పూజతో జాతర ప్రారంభం అయింది. నాగోబా జాతర వేడుకలకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు ఈ వేడుకలను మేస్రం వంశీయులతో కలిసి ప్రారంభించారు. ఐదురోజుల పాటు మహాజాతర జరుగుతుంది.

read also : తెలంగాణ బడ్జెట్ 2,75,891 కోట్లు .. ఆరు గ్యారెంటీలు, విద్యకు ప్రాధాన్యం ..

నాగోబా జాతర కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆదివాసీ సాంప్రదాయ, వాయిద్యాలైనా డోలు, సన్నాయిల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మట్టిని పేర్చి భార్యాభర్తలు కలిసి పుట్టను తయారు చేయడం ఆచారంగా ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడును నాగోబా జాతర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకుముందు మేస్రం వంశీయులు భక్తిశ్రద్ధలతో వేడుకలకు హాజరై గంగనీలను నాగదేవతకు సమర్పించి పూజలకు శ్రీకారం చుట్టారు.

Hospital

read alsso : గ్రూప్ 4 ఫలితాలు వచ్చేశాయ్.. 7,26,837 మంది అర్హత సాధించినట్లు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ ..

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఏ పిఓ, వేడుకలకు హాజరైన ముఖ్య అతిథులు అయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్,ఇతర ప్రజాప్రతినిధులకు మేస్రం వంశీయులు నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. ఈ నెల 12న దర్బార్ నిర్వహించనుండగా దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు హాజరుకానునట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

 

Leave A Reply

Your email address will not be published.