Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ కాని డాక్టర్ .. పేదల పాలిట వైద్యనారాయణుడు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 29

ఎండాకాలంలో వడదెబ్బ తగిలినా.. వర్షాకాలంలో వైరల్ ఫీవర్ లు పొంచి ఉన్నా.. చలి కాలంలో జలుబు లు, దగ్గు, జ్వరం వంటి వాటి బారీన పడినా ఆప్రాంతం వారికి ఆయనే గుర్తొస్తారు. చిన్న చిన్న ఇన్ ఫెక్షన్స్ నుండి రోజూ వారీ పనులు చేసుకొని బ్రతికే ఆ ఏరియా వారికి తల నెప్పి ఒళ్ళు నొప్పుల వంటి వాటికి ఆయనే వైద్యుడు. పైసా ఆశించకుండా అడిగిన వారికి లేదనకుండా పరిస్థితిని బట్టి లక్షణాలను బట్టి మందులు అందించడం ఆయన ప్రత్యేకత. అంతే కాదు వారు కోలుకునే వరకు వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తూ, వైద్య సేవలు అందిస్తున్న ఆ డాక్టర్ కాని డాక్టర్ నార్నె వెంకట ప్రసాద్ ( narne venkata prasad ). ఆయన నివసించే ఖమ్మం రమణ గుట్ట ప్రాంత ప్రజలకు ఆయన నిజంగానే దేవుడిచ్చిన వైద్యుడుగానే చెప్పుకుంటారు. అందుకే అక్కడ అందరూ ఆయనను ప్రేమగా డాక్టర్ బాబు అని పిలుచుకుంటారు.

read also : మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీస్ యంత్రాంగానికి శిక్షణా తరగతులు..

వివరాల్లోకెళితే ఖమ్మం నగరంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ కంపెనీ రీజనల్ మేనేజర్ నార్నె వెంకట ప్రసాద్ గత 30 ఏళ్ళుగా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. సాదారణ మెడికల్ రిప్రజెంటెటీవ్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ప్రసాద్ ఆరోజుల్లోనే తన వద్ద మిగిలిన వివిధ సాదారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన శాంపిల్ లను తన వద్దకు వచ్చే వారికి ఉచితంగా పంపిణీ చేస్తుండేవారు. దాంతో ఆనోటా ఈ నోటా ఆయన గురించి తెలుసుకున్న ఆప్రాంత పేదలు తమకు జలుబు చేసినా దగ్గు సాదారణ జ్వరాలు వంటివి వచ్చినా వాటికి హాస్పిటల్ లకు వెళ్లే స్థోమతు లేక పోవడంతో ప్రసాద్ ను ఆశ్రయించే వారు. దాంతో వారి పరిస్థితికి జాలిపడిన ప్రసాద్ తమ వద్ద ఉన్న మందులను వారి అవసరాన్ని బట్టి పంపిణీ చేసేవారు. దాంతో ఆ ప్రాంత ప్రజలకు ఆయన అభిమాన పాత్రుడు అవడమే కాకుండా, అందరూ ప్రసాద్ ని డాక్టర్ బాబు అని పిలుచుకోవడం ప్రారంభించారు.

read also : పక్కాగా ఓట్లను లెక్కించాలి.. ప్రతిదీ రికార్డు అవుతుంది..

Hospital

సామాజిక సేవల్లోను ముందే..

తన బాదే కాదు అందరి బాద తనదే అనుకునే నార్నె వెంకట ప్రసాద్ కేవలం అనారోగ్య పరిస్థితులనే కాదు తన చుట్టూ ఉన్న సమాజంలో పలు రకాల ఇబ్బందులను నిశితంగా పరిశీలిస్తారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా అందుకు సంబంధించిన పరిస్థితులను ఆరా తీసి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అందులో రోడ్లు, డ్రైనేజీల సమస్యలే కాదు వర్షాకాలం సీజనల్ వ్యాధుల సమయంలోను తనకు పరిచయస్తులైన వైద్యుల సహకారం తో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. అంతే కాదు మెడికల్ రిప్రజెంటెటీవ్ అసోషియేషన్ కి వెన్నుదన్నుగా ఉంటూ సేవలందిస్తున్నారు. 2005లో ఆలిండియా కమిటీ పిలుపునందుకొని మెడికల్ రిప్రజెంటెటీవ్ ల 8 గంటల పని విధానం కోసం పోరాటం చేసి రాష్ట్రంలోనే లక్ష్యాన్ని సాధించిన జిల్లాగా ఖమ్మం జిల్లాను నిలపడంలో విజయకేతనం ఎగురవేశారు. అంతే కాదు రిప్స్ కి యాక్సిడెంటల్ బీమా సదుపాయం కల్పించేలా కృషి చేసి విజయం సాధించారు. దాంతో ఆయన అదించిన సేవలకు గాను పలు అవార్డులు ప్రశంసలు అందుకున్నారు.

పండుగలు.. ఉత్సవాల్లోను..

ఎప్పుడూ తన చుట్టూ ఉండే వారితో సరదాగా కలుపుగోలుగా ఉండే నార్నె వెంకట ప్రసాద్, పండుగలు ఉత్సవాల సమయంలో ఆ ప్రాంత ప్రజలతో మమేకమై పోతారు. దసరా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ఆప్రాంత కమిటీ బాద్యుడిగా అందరికీ తల్లోనాలుకగా వ్యవహరిస్తూ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు అందరినీ సమన్వయ పరుస్తుంటారు. సామూహిక అక్షరాభ్యాసాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఆపద్భంధువుగా అండగా నిలుస్తుంటారు.

అందుకే అక్కడ అందరికీ ఆ డాక్టర్ కాని డాక్టర్ బాబు అంటే ప్రత్యేకమైన గౌరవం. ఆయన ఇటీవల తన కుమారుడి వద్దకు అమెరికా పర్యటనకు వెళ్ళడంతో ఎంతో మంది ఆప్రాంత ప్రజలు ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రసాద్ తిరిగి జులై 2న ఖమ్మం రానుండడంతో ఎంతో ఆత్రుతగా ఆయన రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.