Read News in Telugu Language
adsdaksha

తెలంగాణలోని 40 బీసీ కులాలను OBC జాబితాలో చేర్చండి..

జాతీయ బీసీ కమిషన్ ను కోరిన ఎంపీ బీబీ పాటిల్ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్..

తెలంగాణ ( telangana ) లోని 40 బీసీ ( bc ) కులాలను ఓబిసి ( obc )  జాబితాలో చేర్చాలని ఎంపీ బీబీ పాటిల్ ( mp bb patil ), రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ( shubhapradh patel ) జాతీయ బీసీ కమిషన్ ( national bc commission ) ను కోరారు. ఢిల్లీ ( delhi ) లోని మహారాష్ట్ర సధన్  ( maharastra sadan ) లో మంగళవారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ( hansraj gangaram ahir ) అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్ తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్ తో పాటు 40 కులాలను OBC జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ ని కోరారు.

Hospital

read also : rain alert : తెలంగాణ కు భారీ వర్ష సూచన .. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..

40 కులాలు OBC జాబితాలో లేకపోవటం వలన ఆ సామాజిక వర్గాలకు చెందిన బీసీలు.. కేంద్రంలో విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ల ఫలాలు కోల్పోతున్నారని ఆధారలతో సహా జాతీయ బీసీ కమిషన్ కు నివేదిక సమర్పించారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంలో ముందడుగు పడటం లేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలుసుకోని ఇప్పటికే పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయంపై జాతీయ బీసీ కమిషన్ సానుకూలంగా స్పందించి.. తెలంగాణలోని 40 కులాలను న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా.. OBC జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఎన్సీబీసీ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.