Read News in Telugu Language
adsdaksha

neet ug 2024 : మే 5న నీట్ ఎగ్జామ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 10

ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మార్చి 9వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ..

మెడిసిన్ చదవాలని అనుకునే వారికి అబ్డేట్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ (నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2024) యూజీ ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ వచ్చేసింది.  ఈ ప‌రీక్ష‌ను మే 5వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్ర‌వారం అధికారికంగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నీట్ యూజీ 2024 ( neet ug 2024) పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాష‌ల్లో పెన్ను, పేప‌ర్ విధానంలో ఈ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Hospital

read also : అర్థరాత్రి మంత్రి సీతక్క తనిఖీ లు.. మేడారం ఏర్పాట్ల పరిశీలన.. అధికారులతో సమీక్ష ..

ఈ పరీక్షకు అప్లై చేసే విద్యార్థులు రూ. 1700 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. జనరల్ ఈడబ్య్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ (నాన్ క్రీమీలేయర్) కేటగిరీల విద్యార్థులు రూ. 1600 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్ విద్యార్థులు రూ. 1000 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందనీ నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.