Read News in Telugu Language
adsdaksha

ప్రంపంచ స్థాయిలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ ను తీర్చిదిద్దుతాం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 6

వైల్డ్ లైఫ్ వారోత్స‌వాలు, జూ పార్క్ వ‌జ్రోత్స‌వాలలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నెహ్రూ జులాజికల్ పార్కు ( nehru zoological park ) ను సీఎం కేసీఆర్ ( cm kcr ) స‌హ‌కారంతో ప్ర‌పంచ‌స్థాయి జూగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ( indra karan reddy ) అన్నారు. అందుకోసం అట‌వీ శాఖ పూర్తి స‌హాయ‌ సహకారాలు అందిస్తున్న‌ద‌ని తెలిపారు. నెహ్రూ జూలాజిక‌ల్ పార్కులో ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ వారోత్స‌వాలు (wildlife week celebration ), జూ పార్క్ వ‌జ్రోత్స‌వాలు ( zoopark vajrotsavalu ) పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇంటిగ్రెటేడ్ ఆన్ లైన్ టికెట్ సేవ‌ల‌ను ప్రారంభించారు. జూ పార్క్ ప్ర‌ధాన ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ఏర్పాటు చేసిన వ‌జ్రోత్స‌వాల లోగోను, అనంత‌రం డైమండ్ జూబ్లీ ఫైల‌న్, సెంట్ర‌ల్ పౌంటెయిన్ ను ఆవిష్క‌రించారు.

read also : అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

Hospital

అనంతరం 30 సంవ‌త్స‌రాల తర్వాత మ‌ళ్ళీ 2 క్యాపిచినో మంకీస్ ను మంకీ మోట్ లోకి, 2 వైట్ టైగ‌ర్స్ ను సంద‌ర్శ‌కుల వీక్ష‌ణ కోసం టైగ‌ర్ మోట్ లోకి విడుద‌ల చేశారు. రెండు వైట్ టైగర్స్ కు శివ‌పార్వ‌తులుగా మంత్రి నామ‌క‌ర‌ణం చేశారు. జూ సంద‌ర్శ‌న కోసం గ్లాండ్ ఫార్మా దాతృత్వంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ బైస్కిల్, ఎల‌క్ట్రిక‌ల్ రోడ్ ట్రైన్ సేవ‌ల‌ను ప్రారంభించారు. మంత్రి కాసేపు సైక్లింగ్ లో షికారు చేశారు.

అనంత‌రం డైమండ్ జూబ్లీ సెల‌బ్రేష‌న్ లో భాగంగా నిర్వ‌హించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. జూ పార్కులో వివిధ విభాగాల్లో ఉత్త‌మ సేవ‌లను నిర్వ‌హించిన సిబ్బందిని స‌త్క‌రించారు. సామాజిక బాధ్య‌త‌గా జూ నిర్వ‌హ‌ణ‌కు ఆర్థిక చేయూత‌నిస్తున్న పలు కంపనీ యజ‌మానులు, ఎస్బీఐ ప్ర‌తినిధుల‌ను, విద్యాల‌యాల నిర్వ‌హ‌కుల‌ను స‌త్క‌రించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…. సామాజిక బాధ్య‌త‌గా వ‌న్య‌ప్రాణుల‌, ప‌క్షుల ఆల‌న‌పాల‌న‌కు కావాల్సిన ఆర్థిక చేయూత‌ నిచ్చేందుకు మందుకు వ‌స్తున్న‌ కార్పోరేట్ కంప‌నీల సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. నెహ్రూ జూలాజిక‌ల్ పార్కును దేశంలోనే ఆద‌ర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న అట‌వీ శాఖ అధికారులు, జూ పార్కు ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.

read also : తెలంగాణలో తొలి రోప్ వే… పనులకు మంత్రి శంకుస్థాపన..

పిసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్. ఏం. డోబ్రియాల్, వైల్డ్ లైఫ్ చీప్ వార్డెన్ లోకేష్ జైశ్వాల్, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఆర్. శోభ‌, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎం.సీ. పర్గెయిన్, అట‌వీ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి ప్ర‌శాంతి, అదనపు పీసీసీఎఫ్, సునీతా భగవత్, జూ డైరెక్ట‌ర్ వీఎస్ఎల్ వీ. ప్ర‌సాద్, క్యూరేట‌ర్ సునీల్ ఎస్ హీరేమ‌త్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.