Read News in Telugu Language
adsdaksha

న్యూ ఇయర్‌ వేడుకలకు అధికారుల ఆంక్షలు .. గైడ్ లైన్స్ విడుదల చేసిన పోలీసులు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 19

ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పి నూతన సంవత్సరం 2024 ఆహ్వానించే వేళ నూతన సంవత్సర వేడుకల ( new year celebration ) పై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ సెలబ్రేషన్స్ పై పలు ఆంక్షలు విధిస్తూ గైడ్ లైన్స్ విడుదల చేశారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

read also : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు భట్టికి ఆహ్వానం..

Hospital

మరో పది రోజుల్లో కొత్త ఏడాది 2024లోకి అడుగుపెట్టబోతున్ననేపథ్యంలో న్యూ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించడం తో యువత ముందుగానే తమ ప్లాన్ లు సిద్దం చేసుకుంటుంన్నారు. ప్రతి ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలని, సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని ముందే హెచ్చరించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మద్యం అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదని తెలిపారు. వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.

read also : చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత..

అంతేకాదు.. న్యూఇయర్ ఈవెంట్స్ లో శబ్ధ కాలుష్యం ఉండకూడదని, అశ్లీల నృత్యాలకు 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలని అధికారులు ఆంక్షలు విధించారు. అశ్లీల నృత్యాలకు కూడా అనుమతులు  లేవని స్పష్టం చేశారు. రాత్రి ఒంటిగంట తర్వాత కూడా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Leave A Reply

Your email address will not be published.